Home > ఆంధ్రప్రదేశ్ > పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10లక్షలు కొట్టేసిన కిలాడీ..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10లక్షలు కొట్టేసిన కిలాడీ..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10లక్షలు కొట్టేసిన కిలాడీ..
X

అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లైంది కానీ కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నాడు. రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో పరిచయమైన ఓ కిలాడీ సదరు వ్యక్తిని మాటలతో నమ్మించింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.10 లక్షలకు పంగనామం పెట్టింది.

అనకాపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రెండో పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తనను తాను న్యాయవాదినంటూ పరిచయం చేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చెప్పింది. ఇదే విషయాన్ని తన తండ్రితోనూ చెప్పించింది. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సదరు బాధితుడు ప్రభుత్వం ఉద్యోగం లేదని చెప్పడంతో ఆ కిలేడీ తానే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించింది. అయితే దానికి కొంత మొత్తం ఖర్చవుతుందని చెప్పింది.

కిలాడీ మాటలు నమ్మిన బాధితుడు పెళ్లి జరుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అలా 2022 అక్టోబరులో రూ. 5లక్షలు, నవంబరులో మరో రూ. 5 లక్షలు ఆమె బ్యాంకు అకౌంట్‌ కు ట్రాన్స్ఫర్ చేశాడు. పది లక్షలు ఖాతాలో పడగానే ఆ కిలాడీ అసలు కథ మొదలుపెట్టింది. బాధితుడి కాల్ లిఫ్ట్ చేయడం మానేసింది. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుతిరగడం మొదలుపెట్టింది.

నెలలు గడుస్తున్నా ఉద్యోగం, పెళ్లి పేరు ఎత్తుకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు ఓ రోజు ఆమెను నిలదీశాడు. దీంతో ఆ కిలాడీ ప్రియుడితో కలిసి అతన్ని చంపేస్తానని బెదిరించింది. మోసపోయానని గ్రహించిన సదరు వ్యక్తి అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 13 Jun 2023 10:43 AM IST
Tags:    
Next Story
Share it
Top