Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన సీఎం జగన్..

ఏపీ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన సీఎం జగన్..

ఏపీ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన సీఎం జగన్..
X

ఈ నెల అక్టోబర్ 25 నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది ఏపీలోని వైసీపీ ప్రభుత్వం. దాదాపు 60 రోజుల పాటు బస్సు యాత్రలు కొనసాగుతాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే దాదాపు 60 రోజుల పాటు మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. సోమవారం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ .. జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు ప్రకటించారు. ఈ సభలోనే ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. మార్చి, ఏప్రిలో లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కీలక ప్రకటన చేశారు.

సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…బస్సు యాత్ర టీం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సీనియర్ నాయకులు ఉంటారని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు ఉంటాయని.. ఒక్కో నియోజకవర్గంలో పర్యటించిన సామాజిక న్యాయం, చేసిన అభివృద్ధి, తీసుకుని వచ్చిన మార్పులను వివరిస్తారన్నారు. బస్సు పై నుంచే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.

నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 10వరకూ వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని చేపడతామన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్‌కు జగనే మళ్లీ ఎందుకు కావాలంటే.. ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్‌ రావాలని అన్నారు. వైఎస్సార్‌సీపీ తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదని అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని, వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స ఇచ్చేందుకు సురక్ష పథకం తెచ్చామన్నారు. 15వేల హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సురక్ష ద్వారా కోటి 65 లక్షల ఇళ్లను కవర్‌ చేస్తున్నామన్నారు.

జనవరి 1 నుంచి పెన్షన్‌ పెంపును అమలు చేస్తామని వృద్ధులు, వితంతువులకు శుభవార్త తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 3000 పెన్షన్‌ అందిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు పెంచిన పెన్షన్‌ వర్తిస్తుందని చెప్పారు. జనవరి 10 నుంచి జనవరి 20 దాకా చేయూత ఉంటుందని, రూ. 19 వేల కోట్లు నిధులను చేయూత ద్వారా అందిస్తున్నామన్నారు.




Updated : 9 Oct 2023 7:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top