Lakshmi Parvathi: కుటుంబాల్లో చిచ్చులు పెట్టే వ్యక్తి చంద్రబాబు.. లక్ష్మీ పార్వతి
X
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయండలో చంద్రబాబునాయుడు దిట్ట అని, అలాంటి వ్యక్తి వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు లక్ష్మీ పార్వతి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని.. చివరకు ఆ పార్టీ నేతల కాళ్ల దగ్గరే తాకట్టు పెట్టాడని విమర్శించారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె... ప్రజలు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయ్యాలని ప్రశ్నించారు. అధికారం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు దుర్మార్గుడనే విషయాన్ని గ్రహించాలని, చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ కుటుంబంలో ఉండకూడని ఎన్టీఆర్ అన్నారని ఆమె గుర్తు చేశారు. టీడీపీ నుంచి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలని, ఎల్లో మీడియాని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు.
రాజకీయాల్లోకి వచ్చేటప్పడు కేవలం రెండే ఎకరాలున్న చంద్రబాబు.. ఈనాడు రూ.6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ పార్లమెంట్ లో చెప్పగానే చంద్రబాబు ఢిల్లీ వాలిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గంటసేపు ఢిల్లీకి వెళ్లిన వెంటనే ఒక గంటలో ఫేక్ సర్వే ఒకటి బయటకు బయటకొచ్చిందని విమర్శించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు రకరకాల వేషాలు వేస్తున్నారన్నారు.
"ఎన్టీఆర్ కీ, పిల్లలకీ మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు జగన్ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాడు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుని అమిత్ షా కలవలేదు. కలిస్తే ఆ ఫోటో చూపించాలి. చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు. అందుకే అన్నిసీట్లనూ కూడా బీజేపీకి ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు. కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు బీజేపీతో కలవబోతున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలతో ఎండ్ కార్డు పడుతుంది” అని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు.