Home > ఆంధ్రప్రదేశ్ > కాంగ్రెస్లోకి షర్మిల.. వైసీపీ పెద్దలు ఏమన్నారంటే..?

కాంగ్రెస్లోకి షర్మిల.. వైసీపీ పెద్దలు ఏమన్నారంటే..?

కాంగ్రెస్లోకి షర్మిల.. వైసీపీ పెద్దలు ఏమన్నారంటే..?
X

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకు అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. ఆమె కూడా అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్లో చేరడానికి.. ఏపీ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జగన్ను జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరిన ప్రత్యర్థులుగానే చూస్తామని చెప్పారు. జగన్ను మరోసారి సీఎం చేయడమే తమ ధ్యేయమన్నారు.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బందేమి లేదని మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్ని కూటములు వచ్చిన తమకు భయం లేదన్నారు. తమకు దేవుడి ఆశీస్సులున్నాయని.. మరోసారి జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తమకొచ్చే ఇబ్బందేం లేదని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఆమె కాంగ్రెస్‌లో చేరితే తమ ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక శాతం ఓటు బ్యాంక్‌ కూడా లేదని చెప్పారు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని మండిపడ్డారు.


Updated : 4 Jan 2024 4:37 PM IST
Tags:    
Next Story
Share it
Top