Home > ఆంధ్రప్రదేశ్ > Breaking News: సీఎం జగన్కు షాక్.. కీలక నేత రాజీనామా

Breaking News: సీఎం జగన్కు షాక్.. కీలక నేత రాజీనామా

Breaking News: సీఎం జగన్కు షాక్.. కీలక నేత రాజీనామా
X

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు భారీ షాక్ తగిలింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసిన లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. రామకృష్ణారెడ్డి రాజీనామా వైసీపీ లో సంచలనం రేకెత్తించింది. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన.. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అధిష్టానంపై అసంతృప్తి కారణంగా పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి టికెట్ బీసీలకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదికాకుండా ఇటీవలే మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్ గా గంజి చిరంజీవిని నియమించారు. దాంతో పార్టీపై అలకబూనిని రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Updated : 11 Dec 2023 12:18 PM IST
Tags:    
Next Story
Share it
Top