శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అనిల్ సంచలన కామెంట్స్
X
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని... ఒకవేళ నేను ఓడితే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అనిల్ సవాల్ విసిరారు. లోకేష్ చేత నెల్లూరు టికెట్ కన్ఫర్మ్ చేసుకుని తనపై పోటీ చేయాలని... అప్పుడు ఎవరేందో తేలిపోతుందని అన్నారు. నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము అనం కి ఉందా..? అని అనిల్ యాదవ్ ప్రశ్నించారు. ఆనం రాంనారాయణ రెడ్డి రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడే ఆయన రాజకీయం క్లోజ్ చేస్తానని అనిల్ యాదవ్ హెచ్చరించారు. అలా చెయ్యని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.
2024లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలి.. ఓడిపోతే 44 ఏళ్లకే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అంటూ అనిల్ సవాల్ చేశారు. దమ్ముంటే టీడీపీ నుంచి టిక్కెట్ తెచ్చుకోవాలని ఛాలెంజ్ కూడా చేశారు.. నెల్లూరులో ఎక్కడ నుంచైనా పోటీ చేసే సత్తా ఉందంటున్నావు.. నీది పెద్ద కుటుంబం, బచ్చా గాడి మీద పోటీ చేసి గెలువు అంటూ ఫైర్ అయ్యారు. ఆనం ఎక్కడా పోటీ చేసినా గెలవరని.. టీడీపీని సైతం వదిలేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో వైసీపీలో కలుపు మొక్కలుగా ఉన్న ముగ్గురిని పీకి పారేశారని.. వచ్చే ఎన్నికల్లో పది స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో వైసిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనంకు ఆ పదవిలో కొనసాగడానికి సిగ్గుండాలని అనిల్ మండిపడ్డారు. వైసిపి నుండి సస్పెండ్ చేసినా ఆనం రాజీనామా చేయడంలేదని అన్నారు.
ఇక టీడీపీ యువగళం పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలకూ గట్టి కౌంటర్ ఇచ్చార్ అనిల్ కుమార్. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లుగా లోకేష్ పాదయాత్రతో అధికారంలోకి వస్తామని టీడీపీ నాయకులు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో నెల్లూరు అభివృద్ది జరిగిందని అంటున్న నాయకులు ఏ ప్రభుత్వంలో ఎంత ఖర్చుపెట్టారో చర్చకు సిద్దమా అంటూ అనిల్ సవాల్ విసిరారు.