Balineni Srinivasa Reddy : ఎన్నికలపై వైసీపీ కీలక నేత బాలినేని సంచలన వ్యాఖ్యలు
X
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే తన చివరి ఎన్నికలు అని చెప్పారు. వచ్చే ఎన్నికల నుంచి తనకు కొడుకు ప్రణీత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించారు. ఈ సారి ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట సీటు విషయంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. పేదల ఇంటి స్థలాలకు నిధుల మంజూరు తర్వాత మొదటి సారి ఒంగోలుకు వచ్చిన బాలినేనికి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడినప ఆయన.. ఎన్.అగ్రహారం, వెంగముక్కలపాలెంలో భూసేకరణ చేస్తున్నామని.. దీన్ని కోసం రూ.180కోట్లు విడుదలైనట్లు వివరించారు. ఫిబ్రవరి 10లోపు 25వేల మంది పేదలకు సీఎం జగన్ చేతులమీదుగా ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పారు. ఒంగోలులో టీడీపీ నేతల వైఖరీ వల్లే జగనన్న ఇళ్ల కాలనీలు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. ఏపీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. కాగా ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో అధిష్ఠానం తీరుపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఆ టికెట్ను మాగుంటకు కాకుండా ఇతరులకు ఇచ్చేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తుండగా.. బాలినేని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో టికెట్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్గా మారింది.