ఎవరి బొచ్చో పెట్టుకుని.. బాలయ్యపై కొడాలి సంచలన కామెంట్స్
X
చంద్రబాబు అరెస్ట్పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబుకు పురందేశ్వరి, బాలకృష్ణ వంటి వారు మద్దతివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. తలపై ఎవరిదో బొచ్చు పెట్టుకొని తిరుగుతున్న బాలకృష్ణ, ఇప్పుడైనా కనీసం బ్రెయిన్ వాడాలని సూచించారు. బాలకృష్ణ బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్ అంటూ ఫైర్ అయ్యారు. పురందేశ్వరి, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన అరెస్టును పురందేశ్వరి ఖండిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొనే పవన్.. ఆయనకు మద్దతుగా మాట్లాడటం సహజమని కొడాలి అన్నారు. చంద్రబాబు అవినీతిలో వీళ్లందరికీ భాగం ఉందని.. అందుకే దొంగలంతా ఆయనకు మద్దతు పలుకుతున్నారన్నారు. చంద్రబాబుకు వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్న ఆయన.. తనను అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది అంటూ మండిపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సిట్ విచారిస్తోంది. ఇవాళ ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసిన సిట్.. సాయంత్రం 5గంటలకు కుంచనపల్లిలోని సిట్ ఆఫీసుకు తీసుకొచ్చింది. అప్పటినుంచి బాబును అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేపు తెల్లవారుజామున 5 గంటలకు చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చంద్రబాబును ఇవాళ ఉదయం 6గంటలకు అరెస్ట్ చేసిన సిట్కు కోర్టులో హాజరుపరిచేందుకు రేపు ఉదయం 6గంటల వరకు టైం ఉంది. దీంతో అధికారులు ఉదయం వరకు బాబును విచారించే అవకాశం ఉంది.