Home > ఆంధ్రప్రదేశ్ > Ycp Rebel Mlas : స్పీకర్ నోటీసులపై హైకోర్టుకు వైసీపీ ఎమ్మెల్యేలు

Ycp Rebel Mlas : స్పీకర్ నోటీసులపై హైకోర్టుకు వైసీపీ ఎమ్మెల్యేలు

Ycp Rebel Mlas   : స్పీకర్ నోటీసులపై హైకోర్టుకు వైసీపీ ఎమ్మెల్యేలు
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఇవాళ తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఫిర్యాదుతో స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరుకావడంపై వైసీపీ ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తారనే ప్రచారం జోరందుకుంది.

ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు న్యాయస్థానంలో స్పీకర్ నోటీసులను సవాల్ చేశారు. మరోవైపు మండలి చైర్మన్ నోటీసును ఎమ్మెల్సీ రామచంద్రయ్య సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.


Updated : 29 Jan 2024 7:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top