Home > ఆంధ్రప్రదేశ్ > పోటీలో భువనేశ్వరి అంటూ వైసీపీ ట్వీట్.. మండిపడ్డ టీడీపీ

పోటీలో భువనేశ్వరి అంటూ వైసీపీ ట్వీట్.. మండిపడ్డ టీడీపీ

పోటీలో భువనేశ్వరి అంటూ వైసీపీ ట్వీట్.. మండిపడ్డ టీడీపీ
X

తెలుగు దేశం పార్టీ చీఫ్ చంద్రబాబు స్థానంలో కుప్పం నుంచి తాను పోటీ చేస్తానని ఆయన భార్య భువనేశ్వరి చెప్పినట్లు వైసీపీ చేసిన ట్వీట్‌పై టీడీపీ మండిపడింది. నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరి కుప్పం ప్రజలతో సరదాగా మాట్లాడారు. చంద్రబాబుని 35 సంవత్సరాలు గెలిపించారు. ఈ సారి నన్ను గెలిపిస్తారా..అని ప్రజలను ఆమె కోరారు. దీంతో ఇద్దరు కావాలని అక్కడి వారు అన్నారు. ఇద్దరు ఒక్కరి పేరే చెప్పాలంటు ఆమె అన్నారు. అయితే తను సరదాగా అన్నాని రాజకీయాలకు దూరంగా ఉండటానని క్లారీటి ఇచ్చారు. ఏంటీ, సైకో ఫేక్ చేసింది చూడండి. ఇలా తృప్తి పడుతూ, శునకానందం పొందే బతుకులు బతుకేనా అని ఆమె మాట్లడిన పూర్తి వీడియోను టీడీపీ పోస్ట్ చేసింది.

ఇది పెద్ద జోక్..నిజం అనుకోకండి చంద్రబాబే కుప్పం నుంచి అని పోటీ చేస్తారని అని భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారని.. ఈ సారి తనను గెలిపిస్తారా అంటూ చమత్కరించారు. తమకు ఇద్దరూ కావాలంటూ సభికులు చేతులెత్తారు. అలా కుదరదని.. ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ భువనేశ్వరీ చమత్కరించారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని.. ఎప్పుడు సీరియస్‌గా రాజకీయాలే కాదు.. అప్పుడప్పుడు సరదా సంభాషణలూ జరగాలని ఆమె అన్నారు.చంద్రబాబు గత కొన్నాళ్లుగా పెనమలూరు నియోజకవర్గంపై కన్నేశారని తెలుస్తొంది. తన సామాజిక వర్గం అంటే కమ్మ ఓటర్లు అత్యధికంగా ఉన్న పెనమలూరు అయితే తనకు సేఫ్‌ అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత విశాఖ అనుకున్నా.. అక్కడ గెలిచే అవకాశం లేదని పార్టీ సర్వేల్లో తేలింది. దీంతో కుప్పంను వదిలిపెట్టి పెనమలూరులో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు చంద్రబాబు. 2019లో పెనమలూరులో వైఎస్సార్‌సిపి ఘనవిజయం సాధించింది. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన పార్థసారథి టీడీపీలో చేరారు దీంతో ఆయనకు నూజివీడు టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది



Updated : 21 Feb 2024 4:19 PM IST
Tags:    
Next Story
Share it
Top