Home > ఆంధ్రప్రదేశ్ > సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి

సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి

సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి
X

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆగస్టు 14న విచారణకు రావాలని సీబీఐ కోర్టు అందించిన నోటీసులు ప్రకారం అవినాష్ రెడ్డి నేడు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలపై సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో 145 పేజీల అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

అవినాష్ రెడ్డితో పాటు కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి లను కూడా అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. ఏ-4 దస్తగిరి మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్ రెడ్డిని సీబీఐ చేర్చింది. సీబీఐ మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి జూన్ 19 సీబీఐ డైరెక్టర్‎కు ఒక లేఖ రాశారు. దర్యాప్తు తీరుపై తన అసంతృప్తిని లేఖలో పేర్కొన్నాడు. దర్యాప్తును పున:సమీక్షించాలని కోరాడు. గత దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పై ఈ లేఖలో అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చాలా విషయాలను దర్యాప్తులో మరిచారని అవినాష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి స్టేట్ మెంట్ నే సాక్ష్యంగా పరిగణించారని లేఖలో తెలిపారు. అయితే దీనిపై సీబీఐ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

Updated : 14 Aug 2023 2:04 PM IST
Tags:    
Next Story
Share it
Top