Home > ఆంధ్రప్రదేశ్ > అవినాశ్ తల్లికి సర్జరీ జరగలేదు, అబద్ధాలాడుతున్నారు.. వైఎస్ సునీత

అవినాశ్ తల్లికి సర్జరీ జరగలేదు, అబద్ధాలాడుతున్నారు.. వైఎస్ సునీత

అవినాశ్ తల్లికి సర్జరీ జరగలేదు, అబద్ధాలాడుతున్నారు.. వైఎస్ సునీత
X

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వడంపై వివేకా కూతురు సునీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తల్లికి శస్త్ర చికిత్స జరిగిందని అబద్ధం చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడని, నిబంధనల ప్రకారం అతని బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరారు. ఈమెరకు ఆమె న్యాయవాది స్వేచ్ఛ కోర్టులో పిటిషన్ వేశారు. అవినాశ్ తల్లికి సర్జరీ జరుగుతోంది కాబట్టి తను పక్కనే ఉండాలంటూ బెయిల్ తీసుకున్న అవినాశ్ చెప్పింది నిజం కాదన్నారు.

‘‘అతని తల్లి లక్ష్మమ్మకు సర్జరీ జరగలేదని మాకు తెలిసింది. సర్జరీ చేస్తున్నాని అతని లాయర్ అబద్ధాలు చెప్పాడు. ఆపరేషన్‌కు ఆధారాలు లేవు కాబట్టి అవినాశ్‌పై చర్యలు తీసుకోవాలి. అబద్దాలు చెప్పినందుకు బెయిల్ రద్దు చేయాలి’’ అని కోరారు. తన తల్లికి గుండె నాళాలు మూసుకుపోయాలని అవినాశ్ రెడ్డి చెబుతున్నారు. లక్ష్మమ్మ ఇటీవల ఉపవాసంతో స్పృహ తప్పి పడిపోవడంతో కర్నూలులో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స అవసరమంటూ హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో జైల్లో ఉండడం తెలిసిందే. సీబీఐ దర్యాప్తులో లోపాల వల్లే అవినాశ్ జైలుకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, అన్ని దారులు మూసుకుపోవడంతో తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకున్నాడని సునీత ఆరోపిస్తున్నారు.


Updated : 1 Jun 2023 8:39 AM IST
Tags:    
Next Story
Share it
Top