Home > ఆంధ్రప్రదేశ్ > మీ స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది..ఏపీ సీఎం ఎమోషనల్ ట్వీట్

మీ స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది..ఏపీ సీఎం ఎమోషనల్ ట్వీట్

మీ స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది..ఏపీ సీఎం ఎమోషనల్ ట్వీట్
X

ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఏపీలో వైఎస్ఆర్‎ కార్యకర్తలు జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలోనూ ఆయన అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇడుపులపాయకు వెళ్లారు. తండ్రిని గుర్తుచేసుకుని జగన్ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.





‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్న. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు’’ అని సీఎం ట్విటర్‌లో ఎమోషనల్ అయ్యారు.









Updated : 8 July 2023 10:35 AM IST
Tags:    
Next Story
Share it
Top