Home > ఆంధ్రప్రదేశ్ > YSR : నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

YSR : నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

YSR : నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి
X

ఇవాళ లెజెండరీ నాయకులు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అటు ఏపీ, ఇటు తెలంగాణలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. జన నేతకు ఘన నివాళి అర్పించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలోనూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఇడుపులపాయ చేరుకున్నారు. దివంగత నేత తనయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని తన తండ్రికి నివాళులు అర్పించనున్నారు.

అయితే తండ్రి వర్ధంతి కార్యక్రమాల్లో అన్న జగన్ మోహన్ రెడ్డి, చెల్లి షర్మిల ఎవరికి వారుగా వేరు వేరుగా పాల్గొననున్నారు. గతంలో వైఎస్ పుట్టినరోజు రిపీటైన సీనే ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. అయితే ఈసారి అయినా కలుస్తారేమోనన్న ఆశతో వైఎస్ అభిమానులు ఎదురుచూశారు. తండ్రి వర్ధంతి సందర్భంగా షర్మిల శుక్రవారం సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం షర్మిల ప్రార్ధనలు ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఆమె వెళ్లిన అనంతరం సీఎం జగన్ ఇడుపులపాయకు వచ్చే విధంగా జగన్ రెడ్డి షెడ్యూల్ సిద్ధం చేయడంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‎లోని కడప పులివెందులలో జూలై 8, 1949న దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జన్మించారు. ఆయన కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని జన నేతగా ఎదిగారు. ఉమ్మడి ఏపీనికి రెండు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు రాజశేఖర్ రెడ్డి. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి.. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి కుబి భుజం ఎడమ భుజంలా ఉండేవారు. ఆయన తీసుకునే నిర్ణయాల్లో వీరిద్దరూ ఎప్పుడూ కీలకంగా వ్యవహరించారు.


Updated : 2 Sept 2023 9:37 AM IST
Tags:    
Next Story
Share it
Top