Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila : కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిల డెడ్ లైన్..!

YS Sharmila : కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిల డెడ్ లైన్..!

YS Sharmila : కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిల డెడ్ లైన్..!
X

కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల సైతం ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే ఇంతవరకు ఈ అంశం ఎటూ తేలలేదు. ఈ విలీన ప్రక్రియ ఎందుకు ఆగిందన్నది చర్చనీయాంశంగా మారింది. విలీనం ఉంటుందా లేదా తెలియక వైఎస్సార్టీపీ క్యాడర్ ఆందోళన పడుతోంది. ఈ క్రమంలో షర్మిల అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై సెప్టెంబరు 30లోపు నిర్ణయం తీసుకుంటామని షర్మిల చెప్పారు. విలీనం లేకపోతే సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.


Updated : 25 Sep 2023 12:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top