డీఎస్సీ నోటిఫికేషన్‌పై షర్మిల షాకింగ్ కామెంట్స్
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎస్సీ ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ విడుదలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సర్కార్‌పై ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని షర్మిల విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన డీఎస్సీ ప్రకటన ఒక ఎన్నికల స్టంట్ అని ఆమె ఆరోపించారు.
నేడు వైఎస్ షర్మిల గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం కొలకలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఏపీని వదిలి వలస పోతున్నారన్నారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ నిరుద్యోగులు వలస పోతూ కష్టాలు పడుతున్నారని, వారి గోడు ప్రభుత్వానికి అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పోతేనే ఏపీ బాగుపడుతుందన్నారు.
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చి సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం అమ్మకాలు, మద్యం మృతులు ఎక్కువేనని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఏపీలో ఇసుక మాఫియా వల్ల ప్రజల భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు. ఇటువంటి ప్రభుత్వం ఏపీ ప్రజలకు అవసరం లేదని, అందరూ పోరాడాల్సిన సమయం వచ్చిందని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.