Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila Son Raja Reddy Wedding : షర్మిల కొడుకు వివాహానికి ముహూర్తం ఫిక్స్.. పెళ్లి ఎక్కడంటే..?

YS Sharmila Son Raja Reddy Wedding : షర్మిల కొడుకు వివాహానికి ముహూర్తం ఫిక్స్.. పెళ్లి ఎక్కడంటే..?

YS Sharmila Son Raja Reddy Wedding : షర్మిల కొడుకు వివాహానికి ముహూర్తం ఫిక్స్.. పెళ్లి ఎక్కడంటే..?
X

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రాజారెడ్డి, ప్రియా అట్లూరి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒకటి గతంలో నెట్టింట వైరల్గా మారింది. ఇటీవలే వైఎస్ విజయమ్మ ప్రియాకు చీర పెట్టిన ఫోటో ఒకటి బయటకు రావడంతో రాజారెడ్డి పెళ్లి కన్పామ్ అయిందన్న వార్తలు జోరందుకున్నాయి.

తాజాగా ఈ జోడికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజారెడ్డి, ప్రియల పెళ్లి డేట్ ఫిక్సైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 17న జోధ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం విజయమ్మ, షర్మిల అమెరికాలోనే ఉన్నారు. వారు తిరిగొచ్చిన అనంతరం జనవరి రెండు లేదా మూడో వారంలో హైదరాబాద్‌లో ఎంగేజ్మెంట్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది.

ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన రాజారెడ్డికి ప్రియా అట్లూరితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియా అట్లూరి యూఎస్ లో ఉద్యోగం చేస్తుంది. ప్రియ తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలోనే స్థిరపడ్డారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో అట్లూరి శ్రీనివాస్ కు స్నేహం ఉన్నట్లు సమాచారం. ఆ స్నేహం కాస్తా ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది.







Updated : 15 Dec 2023 3:49 PM IST
Tags:    
Next Story
Share it
Top