Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల
X

జగన్, చంద్రబాబు ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఆమె బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీలపై ఆమె విమర్శలు గుప్పించారు. ఏపీపై రూ.10లక్షల కోట్ల అప్పుల భారం మోపారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన నాటికి లక్ష కోట్ల అప్పు ఉంటే.. గడిచిన ఐదేళ్లలో జగన్ రూ.3లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నారు. పదేళ్లలో ప్రత్యేక హోదా తీసుకరాలేకపోయారని విమర్శించారు.

కొత్త ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదని షర్మిల విమర్శించారు. కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగాలు వచ్చేవని.. కానీ ఒక్క కంపెనీని తీసుకరాలేదన్నారు. భూతద్దంలో వెతికినా ఏపీలో అభివృద్ధి కన్పించడం లేదని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రాజధానిని నిర్మించలేకపోయాయని అన్నారు. గ్రాఫిక్స్లో చంద్రబాబు రాజధానిని చూపిస్తే.. మూడు రాజధానులు అంటూ జగన్ ఒక్కదాన్ని కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.

బీజేపీకి వైసీపీ, టీడీపీలు పోలవరాన్ని తాకట్టు పెట్టాయని షర్మిల ఆరోపించారు. ఆ రెండు పార్టీలు బీజేపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి సహకరిస్తున్న వైసీపీ, టీడీపీకి ఎందుకు ఓటెయ్యాలని షర్మిల ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకొస్తానన్నారు. తనపై నమ్మకముంచి కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించిన సోనియా, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 21 Jan 2024 9:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top