YS Sharmila : ముహూర్తం ఫిక్స్.. మరో రెండ్రోజుల్లో కాంగ్రెస్‌లోకి YS షర్మిల
X
వైఎస్సాఆర్‌టీపీ విలీనంపై షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 4న YSRTPని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు తమ పార్టీ నేతలతో స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా పార్టీని విలీనం చేసే అంశంపై ఈ రోజు హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని YSRTP ఆఫీస్‌లో పార్టీ ముఖ్య సభ్యులు భేటీ అయ్యారు షర్మిల. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నట్లుగా పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఎల్లుండి(గురువారం) వైఎస్సాఆర్‌టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపయినర్ గా పనిచేస్తానని చెప్పారు. భవిష్యత్తులో ఖమ్మం లేదా నల్గొండ ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. AICC జనరల్ సెక్రటరీ ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు. రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు షర్మిల.