Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila: ఇప్పటివరకూ మా హామీలను ఎందుకు నెరవేర్చలేదు: వైఎస్‌ షర్మిల

YS Sharmila: ఇప్పటివరకూ మా హామీలను ఎందుకు నెరవేర్చలేదు: వైఎస్‌ షర్మిల

YS Sharmila: ఇప్పటివరకూ మా హామీలను ఎందుకు నెరవేర్చలేదు: వైఎస్‌ షర్మిల
X

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆ పార్టీ చీఫ్ వైఎస్‌ షర్మిల(APCC Chief YS Sharmilar reddy) దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష చేపట్టిన షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని నరేంద్ర మోదీ ఆనాడు తిరుపతి సభలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని చెప్పారు. విభజన చట్టంలో హామీలను ఇప్పటికీ ఎందుకు నెరవేర్చలేదు’’ అని ప్రశ్నించారు.

మాటలు చెప్పి మాయ చేశారు

‘‘దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ తీసుకువస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ ప్రజల తరఫున నేను అడుగుతున్నా ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చివరకు విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు’’ అని షర్మిల విమర్శించారు.

ఒక్క సీటు గెలవకపోయినా...

ఏపీలో బీజేపీ ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే స్థానంలో గెలవకపోయినా ఆ పార్టీయే రాజ్యమేలుతోందన్నారు షర్మిల. సీఎం జగన్‌ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని, ఏపీ ప్రజలను మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీ ప్రజలను పట్టించుకోట్లేదని, అయినప్పటికీ వైసీపీ ఎంపీలు నోరు మెదపట్లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమని చెప్పిన షర్మిల... అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం అవన్నీ వదిలేసి అన్ని అంశాల్లో బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నారన్నారని ఆరోపించారు. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రెడ్డితో పాటు సీనియర్ నేతలు రఘువీరారెడ్డి , కేవీపీ, జేడీ శీలం, ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్ర రాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలి, తులసి రెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు.


Updated : 2 Feb 2024 4:40 PM IST
Tags:    
Next Story
Share it
Top