Home > ఆంధ్రప్రదేశ్ > హీరోగా షర్మిల కొడుకు!..కటౌట్ చూస్తే అలాగే ఉంది

హీరోగా షర్మిల కొడుకు!..కటౌట్ చూస్తే అలాగే ఉంది

హీరోగా షర్మిల కొడుకు!..కటౌట్ చూస్తే అలాగే ఉంది
X

సినీ సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలోకి రావడం కొత్తేమి కాదు. మెగా ఫ్యామిలీ మొదలు అక్కినేని, నందమూరి వారసులు అందరూ చిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఫ్యామిలీ బ్యాక్‎గ్రౌండ్‎తో పాటు వారి టాలెంట్‎తో సినీ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా రాజకీయ నాయకుల పిల్లలు కూడా సినీ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్‎టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కూడా తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని తెగ ట్రై చేస్తోందనే టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఓ వైపు తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తూనే మరోవైపు కొడుకు ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తున్నారట షర్మిల. రీసెంట్‌గా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ఎయిర్ పోర్ట్‌లో సందడి చేశాడు. హీరో కటౌట్‏తో అందరినీ ఆకర్షించాడు.





షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి కట్ అవుట్‌ చూడటానికి మామూలుగా లేదు. మంచి హైట్ , కలర్, ఫిట్‏నెస్‎తో చూడడానికి చాలా పర్ఫెక్ట్‌గా హీరోగా అనిపించాడు. దీంతో చాలా మంది రాజారెడ్డి హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలంటూ కామెంట్ చేశారు.





అయితే లేటెస్టుగా తెలుసిన విషయం ఏమిటంటే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రాజారెడ్డిని ఇంట్రడ్యూస్ చేస్తారనే టాక్ బాగా వినిపిస్తోంది. పూరీ రాజారెడ్డి కోసం ఓ యాక్షన్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌ తో సాగే ఒక స్క్రిప్ట్‎ను రెడీ చేశారట. షర్మిల ఫ్యామిలీ మెంబర్స్‎కు కూడా స్టోరీలైన్ బాగా నచ్చడంతో త్వరలోనే రాజారెడ్డి ఎంట్రీకి సిద్ధం చేస్తున్నారట. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.




Updated : 11 July 2023 8:42 AM IST
Tags:    
Next Story
Share it
Top