Home > ఆంధ్రప్రదేశ్ > అవినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంలో వైఎస్ సునీత పిటిషన్

అవినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంలో వైఎస్ సునీత పిటిషన్

అవినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంలో వైఎస్ సునీత పిటిషన్
X

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‎పై వైఎస్ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందుస్తు బెయిల్ రద్దు చేయాలని కోరారు. వివేకా కేసులో సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని తన పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని వివరించారు. రేపు సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ పై విచారణకు జరిగే అవకాశం ఉంది. సునీత పిటిషన్‎పై విచారణ సందర్భంగా సీబీఐ సుప్రీంలో వాదనలు వినిపించనుంది.

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మే 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అంతకుముందు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి తల్లి అస్వస్థతకు గురికావడంతో పులివెందుల నుంచి ఆమెను కర్నూలు చికిత్స కోసం తరలించారు. ఆయన ఆస్పత్రిలో ఉండగా..బయట వైసీపీ కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Updated : 6 Jun 2023 8:59 PM IST
Tags:    
Next Story
Share it
Top