Home > ఆంధ్రప్రదేశ్ > సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్

సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్

సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్
X

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టైన ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. గతవారం అనారోగ్యానికి గురవడంతో జైలు అధికారులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో అనారోగ్యం దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.

వివేకా హత్య కేసులో అరెస్టైన భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 16 నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. భాస్కర్‌ రెడ్డి అరెస్టు సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. కేసులో కీలక సాక్షులను అనుచరుల ద్వారా ప్రభావితం చేస్తున్నారని, దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు భాస్కర్‌రెడ్డి ప్రయత్నించారని సీబీఐ అధికారులు ఆరోపిచారు. ఆయన విచారణకు సహకరించడం లేదని, భాస్కర్ రెడ్డి పత్తా లేకుండా పోయే అవకాశముందని రిమాండ్ రిపోర్ట్లో రాశారు.

ఇదిలా ఉంటే చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను వెంటనే ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యారని, మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో జైలు అధికారులు గత శనివారం ఆయనను వైద్యం కోసం నిమ్స్కు తరలించారు.

Updated : 1 Jun 2023 1:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top