Home > ఆంధ్రప్రదేశ్ > వివేకా హత్యకేసు..సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

వివేకా హత్యకేసు..సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

వివేకా హత్యకేసు..సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి
X

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అప్రూవర్‎గా మారిన కీలక నిందితుడు దస్తగిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ ఎంవీ కృష్ణారెడ్డి పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్‌పై దస్తగిరి సుప్రీంకు నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన దస్తగిరి.. వివేకా హత్యకేసులో తనకు న్యాయసహాయం అందించాలని కోరాడు. తనకు సుప్రీంకోర్టులో లాయర్‌ను పెట్టుకునే స్థోమత లేదని.. దీనికి న్యాయస్థానం సాయం కావాలని కోరాడు. దీనిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‎లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. పీఏ కృష్ణారెడ్డి అభ్యర్థనపై వివేకా కుమార్తె సునీత వ్యతిరేకించారు. ఈ క్రమంలో దస్తగిరికి సుప్రీం కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. మరోవైపు దస్తగిరి అప్రూవర్‌గా మారటాన్ని వివేకా హత్యకేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. అయితే నిందితులకు ఇలాంటివి కోరే హక్కు లేదని శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ను జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం డిస్మిస్ చేసింది.


Updated : 2 July 2023 3:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top