కేజ్రీవాల్‌కు జగన్ ఝలక్.. బిల్లుపై మోదీకి జైకొట్టిన వైసీపీ
X
ఢిల్లీ పరిపాలనకు సంబంధించిన కీలక బిల్లుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. తాము ప్రధాని మోదీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ‘నేషనల్ కేపిటల్ రీజియన్ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2023’కు అనుకూలంగా ఓటు వేస్తామని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఢిల్లీ పరిపాలనపై ఆధిపత్యం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ తమకు మద్దతు ఇవ్వాని కేజ్రీవాల్ దేశంలోని పార్టీలన్నిటిని కోరుతున్నాయి. అండగా నిలుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చాయి. అయితే ఢిల్లీ సంపూర్ణ స్థాయి రాష్ట్రం కాదు కనుక తాము బిల్లు అనుకూలంగా ఓటేస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు. దీంతో లోక్‌సభతోపాటు రాజ్యసభలోనూ బిల్లు సునాయంగా గట్టెక్కనుంది. వైసీపీకి రాజ్యసభలో తొమ్మదిమంది సభ్యులు ఉన్నారు. సభలో ఎన్డీఏకు బలం తక్కువ ఉండడంతో జగన్ మద్దతు కలసిరానుంది. 237 మంది ఎంపీలు రాజ్యసభలో ఎన్డీయేకు 123 మంది సభ్యులు ఉన్నారు. 108 మంది బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని బీఆర్ఎస్ ఇప్పటికే తన ఎంపీలకు విప్ జారీ చేసింది.
ఏమిటీ బిల్లు..
ఢిల్లీలో కీలక అధికారుల, నియామకాలపై నియంత్రణను కేంద్రానికే ఉండేలా బిల్లును తీసుకొస్తున్నారు. అధికారులపై ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే సంపూర్ణ అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు ఢిల్లీ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కేంద్రం దాన్ని తప్పించుకోవానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాన్ని చట్టంగా మార్చడానికి తాజా వర్షాకాల సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెడుతోంది. సమాఖ్య విధానానికి భంగం కలిగిస్తున్న బిల్లును బలంగా అడ్డుకోవాలని, రేపు మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి బిల్లుల వల్ల నష్టపోయే ప్రమాదముందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు విపక్షాల నేతలను కలసి మద్దతు కోరారు.