Home > ఆంధ్రప్రదేశ్ > మందేస్తూ.. చిందెయ్ రా’.. రికార్డింగ్ డాన్స్లో వైసీపీ నేతల హల్ చల్

మందేస్తూ.. చిందెయ్ రా’.. రికార్డింగ్ డాన్స్లో వైసీపీ నేతల హల్ చల్

మందేస్తూ.. చిందెయ్ రా’.. రికార్డింగ్ డాన్స్లో వైసీపీ నేతల హల్ చల్
X

పాలించాల్సిన పార్టీ నేతలు.. పార్టీలు చేసుకున్నారు. రికార్డిండ్ డాన్స్ లు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. తాగిన మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తూ స్టేజ్ పై చిందేశారు. ఇదేంటని ప్రశ్నించి వారిపై రెచ్చిపోయారు. ఈ ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం యర్రవరంలో జరిగింది. అధికార పార్టీ సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు పుట్టినరోజు సందర్భంగా పెద్ద పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటుచేశారు. పార్టీకి వచ్చిన నాయకులంతా.. డాన్స్ చేయడానికి వచ్చిన మహిళలతో స్టేజ్ పై చిందులేశారు. ఈ ప్రోగ్రామ్ లో.. ఏలేశ్వరం జడ్పీటీసీ నీరుకొండ రామకుమారి భర్త సత్యనారాయణ, యర్రవరం సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు, యర్రవరం ఆంజనేయస్వామి గుడి చైర్మన్ గుల్లంపూడి గంగాధర్‌లు స్టేజ్ పై చిందులేసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం వీరి డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలు ప్రజలు రికార్డింగ్ డాన్స్ పెడతామంటే ఒప్పుకోని పోలీసులు.. అధికార పార్టీకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు.





Updated : 29 Jun 2023 6:17 PM IST
Tags:    
Next Story
Share it
Top