వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా..జగన్‌ను గజినీతో పోల్చిన ఎంపీ
X
వైసీపీ పార్టీకి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌కి లేఖ రాశారు. గజనీలాంటి మనసత్వం కలిగిన మీతో కలిసి పని చేయలేనని లేటర్‌లో పేర్కొన్నారు. గత మూడేళ్లుగా జగన్ ప్రభుత్వన్నికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు వైసీపీ పార్టీ విమర్శిస్తున్నారు.అయితే రఘురామ తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునే లేదని.. పదవికి రాజీనామా చేయబోనని ఇప్పటికే చెప్పేశారు. ఈ క్రమంలోనే రఘురామ కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు.పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హులుగా చేయడానికి మొహమ్మద్ గజినీలా చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకూ మీరు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని రాజీనామా లేఖలో రఘురామ పేర్కొన్నారు. ప్రయత్నించిన ప్రతిసారీ, మీ శత్రుత్వం, దురుద్దేశపూరిత క్రూరమైన చర్యలు ఉన్నప్పటికీ, గత మూడున్నర సంవత్సరాలుగా నర్సాపురంలో తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం సేవ చేయాలనే తన దృఢ నిశ్చయానికి గుర్తుగా.. వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రఘురామ తెలిపారు