Home > Business Trends > రూ.1.80 లక్షల కోట్ల 2000 నోట్లు వెనక్కి... ఇంకా సగం మార్కెట్‌లోనే

రూ.1.80 లక్షల కోట్ల 2000 నోట్లు వెనక్కి... ఇంకా సగం మార్కెట్‌లోనే

రూ.1.80 లక్షల కోట్ల 2000 నోట్లు వెనక్కి... ఇంకా సగం మార్కెట్‌లోనే

రూ.1.80 లక్షల కోట్ల 2000 నోట్లు వెనక్కి... ఇంకా సగం మార్కెట్‌లోనే
X



రెండు వేల రూపాయల నోట్లను మార్కెట్ చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించాక.. ప్రజలు పెద్దఎత్తున నోట్లను బ్యాంకులకు తీసుకొచ్చి డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 50 శాతం 2000 నోట్లు బ్యాంకులకు చేరాయి. రూ.1.80 లక్షల కోట్ల 2000 నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల చెప్పారు. కేవలం 15 రోజుల్లోనే సగం కరెన్సీ బ్యాంకులకు తిరిగి రావడం గమనార్హం.రూ.2000 నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితి ప్రకారం బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో 85 శాతం కరెన్సీ వెనక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక మార్కెట్లో చలామణీ నుంచి రూ.500 నోట్లను ఉపసంహరించే ఆలోచనేదీ లేదన్నారు శక్తికాంత దాస్ . తిరిగి రూ.1000 నోట్లు ముద్రించి చలామణిలోకి తెచ్చే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు.

ఇప్పుడు తిరిగి వచ్చిన రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమి చేస్తుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. బ్యాంకు మొదట పనికిరాని నోట్లను RBI ప్రాంతీయ కార్యాలయానికి పంపుతుంది. ఇక్కడ నుండి ఈ నోట్లను దుర్వినియోగం కాకుండా కొన్నిసార్లు వాటిని కాల్చివేస్తారు. కొన్ని నోట్లు నకిలీ నోట్లా కాదా అని తనిఖీ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. దీని తర్వాత యంత్రం ద్వారా నోట్లను ముక్కలుగా కట్ చేస్తారు. నోట్ల జీవితకాలం బాగుంటే వాటిని రీసైకిల్ చేసి కొత్త చలామణి నోట్లను తయారు చేస్తారు.

2016 నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో 86 శాతం కరెన్సీని ఆర్బీఐ ఉపసంహరించినట్లయింది. దీంతో ప్రజానీకాన్ని ఇబ్బందుల నుంచి బయట పడవేసేందుకు రూ.2000 నోటును ఆర్బీఐ తీసుకొచ్చింది.





Updated : 9 Jun 2023 10:02 AM IST
Tags:    
Next Story
Share it
Top