అదిరిపోయే ఆఫర్..రూ.10వేలకే రియల్మీ C53 స్మార్ట్‌ఫోన్
X
ప్రముఖ చైనీయ మొబైల్ తయారీదారు సంస్థ రియల్‌మి భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.
రియల్‌మి నుంచి వస్తోన్న ఈ సరికొత్త ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్నవారు ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని రూ.10వేలకే సొంతం చేసుకోవచ్చు. 15శాతం డిస్కౌట్ తో రూ.10,999కే ఈ ఫోన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. దీని రేటింగ్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో 4.5 స్టార్ ఉంది.
1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో C53 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది రియల్మీ. 90 Hz రిఫ్రెష్ రేట్, 560nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు సెన్సార్ ఇచ్చారు. స్పష్టమైన జూమ్‌తో కూడిన 3X ఇన్-సెన్సార్ జూమ్, 108MP మోడ్, నైట్ మోడ్ సిటీ స్ట్రీట్ ఫిల్టర్ వంటి కెమెరా అమేజింగ్ ఫీచర్లతో యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Realme UI T ఎడిషన్‌తో పని చేస్తుంది.
C53 స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ మెమరీ 6GB RAM, 128GB. ఈ ఫోన్‌కు 3-కార్డ్ స్లాట్ యాడ్ చేసింది రియల్మీ. అందులో 2TB వరకు విస్తరించదగిన మెమరీతో SD స్లాట్ ఉంది. ‘మినీ క్యాప్సూల్’ ఫీచర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు అవసరమైన నోటిఫికేషన్‌ల చేసే అనుమతి కల్పిస్తుంది. అంతే కాదు ఫాస్ట్-సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు , అల్ట్రా-బూమ్ స్పీకర్ కూడా ఇందులో పొందుపరిచారు. 5000mAh బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.