ఉద్యోగులకు మరోసారి అమెజాన్ సీఈఓ స్ట్రాంగ్ వార్నింగ్
X
అమెజాన్ సీఈఓ మరోసారి తన ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోం చేసే ఎంప్లాయిస్ కచ్చితంగా వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అయితే సీఈఓ కొత్త రూల్స్‌పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూకుమ్మడిగా విధులను ఆపాలని, ఉద్యోగాలకు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఈఓ ఉద్యోగులకు షాకింగ్ లాంటి వార్తను చెప్పారు. కార్యాలయానికి రావడం ఇష్టం లేని వారు ఇంటికి వెళ్లిపోవచ్చంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చాడు. అమెజాన్ కంపెనీలో ఇంటర్నల్‌గా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నల్ మీటింగ్‌లో సీఈఓ ఆండీ జెస్సీ మాట్లాడారు. ఎంప్లాయిస్ కచ్చితంగా వారంలో మూడ రోజులు ఆఫీస్‌కు రావల్సిందేనని తాజాగా రూల్స్ పాస్ చేశారు. అయితే సీఈఓ నిర్ణయానికి ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఎంప్లాయిస్ ఆఫీస్‌కి తిరిగి రావాలని భావిస్తుండగా , మరికొందరు ప్రయాణ సమయం, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆఫీస్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మూకుమ్మడిగా విధులు నిర్వహించకుండా నిరసన చేస్తామని సీఈఓను హెచ్చరిస్తున్నారు. అమెజాన్ కంపెనీలో అసమ్మతి సెగ కొనసాగుతోంది. ఇంకొందరు ఈ నిర్ణయం నచ్చక తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. మొత్తానికి అమెజాన్ సీఈఓ తీసుకున్న ఈ నిర్ణయం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.