Home > Business Trends > దేశంలో మరో 3 ఆపిల్ స్టోర్‌లు.. ఎక్కడెక్కడంటే..!!!!

దేశంలో మరో 3 ఆపిల్ స్టోర్‌లు.. ఎక్కడెక్కడంటే..!!!!



అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ.. తన ప్రొడక్ట్స్ ద్వారా భారత్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తన సొంత రిటైల్ స్టోర్లను ఇటీవల ఢిల్లీ, ముంబైలలో ఓపెన్ చేసింది. అయితే మరో ఆసక్తికర వార్త ఏంటంటే.. 2027 నాటికి మరో మూడు ఆఫ్‌లైన్ స్టోర్‌లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆపిల్ తన మూడవ స్టోర్‌ను 2025లో ముంబై శివారులోని బోరివలిలో.. నాలుగో ఆపిల్ స్టోర్‌ను 2026లో న్యూఢిల్లీలోని DLF ప్రొమెనేడ్ మాల్‌లో ప్రారంభించాలను ప్లాన్ చేస్తోంది. ఇక 2027లో 5 వ స్టోర్‌ను ముంబై సముద్రతీరంలోని వర్లీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో Apple తన మొదటి రెండు ప్రత్యేకమైన ఇండియా రిటైల్ స్టోర్‌లను CEO టిమ్ కుక్ స్వయంగా ముంబై, ఢిల్లీలో ప్రారంభించారు.

కంపెనీ ఆఫ్‌లైన్ స్టోర్‌ల విస్తరణ ద్వారా.. రాబోయే నాలుగేళ్లలో 24 కొత్త స్టోర్‌లను ప్రారంభించేందుకు iPhone తయారీదారు సమాయత్తమవుతోంది. వీటిలో 15 ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే ఏర్పాటు కానున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. ఈ స్టోర్లు ఇండియా, మలేషియా, జపాన్, చైనా, దక్షిణ కొరియాల్లో ఏర్పాటు కానున్నాయి. గత ఏడాది ఆపిల్ తన ఆదాయంలో దాదాపు మూడింట ఒక వంతు అంటే సుమారు 130 బిలియన్ డాలర్లను వీటి నుంచే ఆర్జించింది. అలాగే ఇండియాలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు స్టోర్ల నుంచి అమ్మకాల ద్వారా గత నెలలో దాదాపు రూ.50 కోట్ల ఆదాయాన్ని ఆపిల్ ఆర్జించిందని తాజా సమాచారం.




Updated : 5 Jun 2023 11:15 AM IST
Tags:    
Next Story
Share it
Top