Home > Business Trends > పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?
X

పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు రోజుల కంటే ఇవాళ బంగారం రేటు మరింత తగ్గింది. బంగారం 250, కిలో వెండి 500 మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250తగ్గి.. 54,700 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 280 తగ్గి 59,670గా ఉంది.

అటు విజయవాడలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం 54,700గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం59,670గా ఉంది. ఇక కిలో వెండి 500 తగ్గి 76,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 54,850గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 59,820గా ఉంది. అయితే ఢిల్లీలో వెండి ధరలు హైదరాబాద్ కన్నా తక్కువగా ఉన్నాయి. అక్కడ కేజీ వెండి ధర 73,000 రూపాయలుగా ఉంది

ప్రధాన నగరాల్లో ధరలు..

చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ.55,300, ముంబైలో రూ.54,700, ఢిల్లీలో రూ.55,100, కలకత్తాలో రూ.54,700, కేరళలో రూ.54,700, వడోదరలో రూ.55,000, జైపూర్ లో రూ.55,100, లక్నోలో రూ.55,100, కోయంబత్తూరులో రూ.55,300, నాగపూర్ లో రూ.54,700, మైసూరులో రూ.54,700గా ఉన్నాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ.60,330, ముంబైలో రూ.59,670, ఢిల్లీలో రూ.60,110, కలకత్తాలో రూ.59,670, కేరళలో రూ.59,670, వడోదరలో రూ.60,000, జైపూర్ లో రూ.60,110, లక్నోలో రూ.60,110, కోయంబత్తూరులో రూ.60,330, , నాగపూర్లో రూ.59,670, మైసూరులో రూ.59,670 గా ఉన్నాయి.

Updated : 10 Aug 2023 11:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top