బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న ధరలు
X
బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం 300, వెండి 700 మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (gold rate) 300 తగ్గి.. 55,100 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 330 తగ్గి 60,110గా ఉంది. అటు వెండి ధర కూడా కాస్త తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి ధర(silver rate) 80,300గా ఉంది.
అటు విజయవాడలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం 55,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం60,110గా ఉంది. ఇక కిలో వెండి 700 తగ్గి 80,300గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 55,250గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 60,260గా ఉంది. అయితే ఢిల్లీలో వెండి ధరలు హైదరాబాద్ కన్నా తక్కువగా ఉన్నాయి. అక్కడ కేజీ వెండి ధర 77,300 రూపాయలుగా ఉంది.
ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ప్రజలు బంగారం, వెండి కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో కాస్త రేట్లు తగ్గడం వారికి కలిసొచ్చే అంశం.