శుభవార్తను మోసుకొచ్చిన శ్రావణం
X
ఈరోజు నుంచి శ్రావణమాసం మొదలైంది. తెలుగువారికి ఇది ఎంతో పవిత్రమైన మాసం. వరలక్ష్మీ దేవిని పూజించుకునే మంచి రోజులు. ఆడవారు బంగారం ఎక్కువగా కొనుక్కునేది ఈ మాసంలోనే. వరలక్ష్మికి బంగారం పెట్టడమే కాకుండా తాము కూడా కొత్త బంగారం కొనుక్కుంటే మంచిదని భావిస్తారు. ఇలాంటి శుభవేళలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనుక్కునేవారికి ఊరట లభిస్తోంది.
ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధర 22 క్యారెట్లు 350 రూ., 24 క్యారెట్లు 380రూ. తగ్గంది. దీనిబట్టి హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54, 100 గా ఉంది. నిన్నటికన్నా 350 రూ. తగ్గినట్టు తెలుస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 380 రూ. తగ్గి 59, 020రూ. గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఊర్లలో ఇదే రేటు ఉంది.
ఇక వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి 500రూ వరకు తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు కేజీ వెండి ధర 75, 700 గా ఉంది. నిన్న మార్కెట్లో కేజీ వెండి ధర 76, 200రూ. ఉండేది.