హీరో నుంచి కొత్త బైక్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు
కాన్వాస్ బ్లాక్
X
ప్రముఖ మోటార్ బైకుల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త బైక్ తీసుకొచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ సిరీస్ 2023 (HF Deluxe 2023) పేరుతో ఆకర్షణీయ ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌తో వచ్చిన ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 60,760. సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర. 66,408. నెక్సస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే, బ్లాక్ మరియు స్పోర్ట్ రంగుల్లో దీన్ని విడుదల చేశారు. ఇది సాధారణ ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటుందని, కస్టమర్లకు నచ్చుతుందని కంపెనీ తెలిపింది.
మైలేజ్, ఇంజిన్ ఇతర ఫీచర్లు
• ట్యూబ్‌లెస్ టైర్, అలోయ్ వీల్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, టాయ్ గార్డ్, 130 ఎంఎం డ్రమ్ బ్రేక్స్
• హాలోజన్ లైటింగ్స్, యుఎస్‌బి చార్జింగ్ పోర్ట్, సీటు ఎత్తు 805 మి.మీ.
• బైక్ బరువు 112 కిమీ బరువును కలిగి ఉంది.
• BS6 స్టేజ్ II ప్ర్రమాణాలకు తగ్గ 97.22 సీసీ ఇంజిన్, 9.8 ఫ్యుయెట్ ట్యాంక్, 7.9 హార్స్ పవర్, 8.05 Nm టార్క్, 4-స్పీడ్ గేర్ బాక్స్
• లీటర్ పెట్రోల్‌కు 65 నుంచి 70 కి.మీ. మైలేజీ.