యాపిల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్..ఇకపై ఆ సమస్యలు ఉండవ్
X
ప్రీమియం క్వాలిటీకి పెట్టింది పేరు యాపిల్ ఐ ఫోన్. రాయల్టీకి సింబాలిక్‌గా, స్టాటస్ సింబల్‌గా భావించి చాలా మంది యాపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు.
లగ్జరీకి మారుపేరైన ఐ ఫోన్లలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ల విషయంలో ఇప్పటికీ చాలా మంది యూజర్లు బ్యాటరీపైనే ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉండటం వల్ల యూజర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా యాపిల్ సంస్థ కూడా ఎప్పుడూ తమ ఫోన్లలో ఇంత సామర్థ్యంతో కూడిన బ్యాటరీ వినియోగించామని చెప్పలేదు. అయితే కొన్నేళ్లుగా యూజర్లు బ్యాటరీ లైఫ్‌పై కంపెనీకి కంప్లైంట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై దృష్టి సారించిన యాపిల్ సంస్థ బ్యాటరీపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో త్వరలో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌లో నాలుగు ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ పేరుతో వీటిని ఈ సంవత్సరమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ 15 సిరీస్‌లలో వినియోగించే బ్యాటరీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. బ్యాటరీ పరిమాణంపై యాపిల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బేసికం ఐఫోన్ 15 సిరీస్‌లో 3,877mAh బ్యాటరీ ఇస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 15 ప్లస్‌ను 4,912mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నారు. ఐఫోన్ 15 ప్రోలో 3,877mAh ఇస్తున్నట్లు తెలుస్తోంది. 15 ప్రో మ్యాక్స్‌ను ఏకంగా 4,852mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
బ్యాటరీలోనే కాదు కెమెరాలోనూ యాపిల్ సంస్థ కొన్ని మార్పులు చేయబోతోంది. గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్‌లో12 ఎంపీ , 48 ఎంపీ కెమెరాలను ఇచ్చారు. కానీ ఈసారి అన్ని 15 సిరీస్‌లలోనూ 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఇవ్వనున్నట్లు టాక్ . పైగా రెండో జనరేషన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అందించనున్నారని సమాచారం. ఇవే కాదు మరిన్ని మార్పులతో ఐఫోన్ 15 సిరీస్ వస్తున్నట్లు తెలుస్తోంది. అవి ఏమిటో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.