Home > Business Trends > మెక్‎డొనాల్డ్ యాడ్ కోసం జూ.ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!

మెక్‎డొనాల్డ్ యాడ్ కోసం జూ.ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!

మెక్‎డొనాల్డ్ యాడ్ కోసం జూ.ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!
X

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‎గా మారిపోయాడు. విదేశాలకు కూడా తెలుగోడి టాలెంట్‌ను రుచి చూపించారు. దీంతో ఎన్టీఆర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం కూడా దర్శక నిర్మాతలు తారక్‎ని సంప్రదిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్- 2 ఖరారైంది. దీని కోసం భారీగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.



సినిమాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా ఎన్టీఆర్ వెంట పడుతున్నాయి. కొన్నిరోజుల క్రితం తారక్ నటించిన మెక్ డొనాల్డ్స్ యాడ్ విడుదలైంది. ఈ యాడ్‎లో తారక్ కొత్త లుక్‎లో కనిపించి అలరించారు. అయితే మెక్ డొనాల్డ్ యాడ్ కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షరాలా రూ. 8కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. తారక్ కొత్త యాడ్‎ తమ బిజినెస్‌కు ప్లస్ అవుతుందని భావించినా మెక్ డొనాల్డ్స్ యాజమాన్యం ఎన్టీఆర్ డిమాండ్ మేరకు రెమ్యూనరేషన్ చెల్లించనట్టు వార్తలు వస్తున్నాయి.



ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తెలుగులో ఆరంగ్రేటం చేస్తోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, సైఫ్ అలీ ఖాన్‌ దేవర సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల కానుంది.


Updated : 11 Jun 2023 5:34 PM IST
Tags:    
Next Story
Share it
Top