Home > Business Trends > భారతీయ మార్కెట్లోకి మరో కొత్త కార్

భారతీయ మార్కెట్లోకి మరో కొత్త కార్

భారతీయ మార్కెట్లోకి మరో కొత్త కార్
X

మారుతి సుజుకి నుంచి మరో కొత్త కార్ వచ్చింది. ఇన్విక్టో పేరుతో 3 వేరియంట్లను విడుదల చేసారు. 24 లక్షల నుంచి 28 లక్షల వరకు దీని ధర ఉంది.

మారుతి నెక్సా నుంచి ఇన్విక్టో పేరుతో కొత్త మోడల్ కారు విడుదల అయింది. ఇన్విక్టో జెటా ప్లస్ 7 సీటర్, 8 సీటర్, ఆల్ఫా 7 సీటర్ కార్లు భారతీయ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. వీటి ప్రారంభ ధర 24.84 లక్షలు ఉండగా, మధ్య వేరియంట్ ధర 26.84 లక్షలు, టాప్ వేరియంట్ ధర 28.42 లక్షలు గా ఉంది. నెలకు 61, 860 సబ్స్క్రిప్షన్ తో కూడా ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చును. నెక్సా బ్లు, మిస్టిక్ వైట్ తో సహా మరో నాలుగు రంగుల్లో ఇన్విక్ట్ కార్ లభిస్తోంది. భారతీయ మార్కెట్లో ఈ కార్ సరికొత్త మోడల్ అని, సంచలనం సృష్టిస్తుందని మారుతీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇన్విక్టో కార్ 2.0 పెట్రోల్ ఇంజిన్, మైబ్రీడ్ మోటార్ తో రూపొందింది. పెట్రోల్ ఇంజిన్ 172 బీహెచ్పీ పవర్ జెనరేటర్, టార్క్ 188 ఎన్ఎమ్ కలిగి ఉన్నాయి. మారుతీ కార్ల అమ్మకాలు పెరిగేందుకు కొత్త కార్ సహాయపడుతుందని మారుతీ ప్రతినిధులు అంటున్నారు. మామూలుగానే భారత్ లో మారుతి అమ్మకాలు ఎక్కువే ఉంటాయి. ఒక్క జూన్ నెలలోనే 8.5 శాతం వృద్ధి కనిపించిందని చెబుతున్నారు.





Updated : 5 July 2023 5:17 PM IST
Tags:    
Next Story
Share it
Top