కోహ్లీ బిజినెస్ పార్టనర్ అంజనా రెడ్డి గురించి మీకు తెలుసా..?
X
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ చదివిన ఓ తెలుగమ్మాయి.. చివరికి భారత్‌కి తిరిగొచ్చి తన సత్తా చాటింది. కుటుంబ వ్యాపారాలను పక్కనపెట్టి.. దిగ్గజ క్రికెటర్ల వ్యాపారాల్లో భాగస్వామిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హైదరాబాదీ. తమ వ్యాపార వ్యూహాలతో సంస్థల్ని లాభాల బాట పట్టిస్తూ.. లక్షల కోట్ల సంపదను ఆర్జిస్తోన్న మహిళల జాబితాను ఏటా రూపొందిస్తుంటుంది హురున్ ఇండియా. కోటక్ వెల్త్‌తో కలిసి ఈ ఏడాది విడుదల చేసిన ‘దేశంలోనే వంద మంది శ్రీమంతురాళ్ల’ జాబితాలో.. హైదరాబాద్‌లోని ప్రముఖ కుటుంబానికి చెందిన అంజనా రెడ్డి.. 31 స్థానంలో నిలిచింది. ఆమె స్థాపించిన యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ ఫ్యాషన్ కంపెనీ.. అత్యంత ఆదరణ పొందుతూ కోట్లు కురిపిస్తోంది.
2011లో భారత్‌కు తిరిగి వచ్చిన అంజనా రెడ్డి.. తొలుత స్పోర్ట్స్ బ్రాండెడ్ వస్తువుల అమ్మకం బిజినెస్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫిర్మ్ అసెల్(300కు పైగా కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది)ను సంప్రదించగా.. ఎవరైనా సూపర్‌స్టార్‌ను ఇన్వెస్టర్‌గా తీసుకువస్తే స్టార్టప్‌నకు సహాయం చేస్తామని షరతు విధించింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను సంప్రదించిన అంజనా రెడ్డి తన కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో సఫలీకృతమయ్యారు. అలా యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సచిన్‌ను భాగం చేశారు.
అనంతరం కలెక్ట్‌బిలియా అనే కంపెనీని స్థాపించగా.. అంజనా రెడ్డికి చుక్కెదురైంది. నష్టాలను పూడ్చుకునే క్రమంలో సచిన్ టెండుల్కర్ టీ-షర్ట్స్ అమ్మకంతో క్లాతింగ్ బిజినెస్‌లో అడుగుపెట్టారు. అయితే, అంతటితో అంజనా రెడ్డి ప్రయాణం ఆగలేదు. తన కంపెనీలలో మరింత మంది సెలబ్రిటీలను భాగస్వామ్యం చేయాలనే తలంపుతో వ్రాన్, ఇమారా వంటి బ్రాండ్లకు రూపకల్పన చేశారు. బాలీవుడ్ స్టార్లు కృతి సనన్, ఆదిత్యరాయ్ కపూర్ ఆమెతో జట్టుకట్టారు. సచిన్ టెండుల్కర్ కూడా ఇందులో భాగం కాగా.. విరాట్ కోహ్లి.. Wrognలో పెట్టుబడులు పెట్టడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించాడు. దీంతో అంజనా రెడ్డి క్లాతింగ్ బిజినెస్ మరో లెవల్‌కు వెళ్లింది. రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న ఆమె.. కంపెనీ విలువ దాదాపు 1200 కోట్లు. మె వెంచర్‌ను విజయవంతం చేసే మార్గంలో, కొన్ని సమయాల్లో రోజుకు 18 గంటలు పనిచేశారు. ఇక టీమిండియా క్రికెట్ స్టార్లతో జట్టుకట్టి తమ బ్రాండ్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి.. విజయవంతమైన బిజినెస్ వుమెన్‌గా కొనసాగుతున్న అంజనా నెట్‌వర్త్ 300 కోట్లు ఉంటుందని అంచనా.