మైక్రోసాఫ్ట్ లో మరోసారి భారీగా లేఆఫ్ లు
X
లేఆఫ్ ల పర్వం ఇంకా ముగియలేదు. పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగులను ఇంకా తొలగిస్తూనే ఉన్నారు. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
ఈ ఏడాది మొదట్లో జనవరిలో 10వేల మందిని లేఆఫ్ చేసిన మైక్రోసాఫ్ట్ మళ్ళీ అంతే ఎత్తున ఉద్యోగాలను పీకేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ధిక సంవత్సరం మొదటి నుంచే ఈ తొలగింపు ప్రక్రియ మొదలైందని చెబుతున్నారు. వాషింగ్టన్ కార్యాలయంలో 276 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకే లేఆఫ్ లు చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం చెబుతోంది. ముందు ముందు మరింత ఉంటాయని...అయితే ఎంత మంది అన్నది చెప్పమని అంటోంది.
వ్యాపారం చేయాలంటే సర్దుబాట్లు తప్పనిసరి అంటోంది మైక్రోసాఫ్ట్. సంస్థ భవిష్యత్తు కోసం ప్రస్తుతం లీడ్ లో ఉన్న టెక్నాలజీలకు ప్రాధాన్యమిస్తామని చెబుతోంది. అందులో భాగంగానే లేఆఫ్ లు అవుతున్నాయని సమర్ధించుకుంటోంది.