9వేలకే one plus 5T.. అమెజాన్లో భారీ డిస్కౌంట్..
X
వన్ ప్లస్ బ్రాండ్కు ఇండియాలో మస్త్ డిమాండ్ ఉంది. ఐ ఫోన్స్ తర్వాత ఎక్కువ మంది వన్ ప్లస్ వైపే మొగ్గు చూపుతున్నారు. దానికి తగినట్లుగానే ఆ కంపెనీ సరికొత్త ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో దూసుకెళ్తోంది. ఇక one plus 5Tపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కేవలం 9వేలకే one plus 5T మొబైల్ ను అందిస్తోంది. అయితే రీఫర్బిష్‌డ్ సెగ్‌మెంట్‌లో ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చారు.
6g ర్యామ్, 64gb స్టోరేజ్ గల ఈ ఫోన్ అసలు ధర రూ. 39,999గా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.01ఇంచెస్ అమోల్డ్ హెచ్డీ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఫొటోల కోసం 20MP కెమెరా, సెల్పీల కోసం 16MP ఫ్రంట్ కలిగివుంది. 3300 mah బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. వన్ ప్లస్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
మరోవైపు వన్ ప్లస్ ఫోన్లలో సమస్యలు ఎదుర్కొనేవారికి కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5వేలకు one plus 10r ను అందిస్తామని తెలిపింది. వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8టీ, వన్‌ప్లస్ 9 ఆర్ ఫోన్లలో గ్రీన్ స్క్రీన్ సమస్య తలెత్తెంది. దీంతో కంపెనీ వారి కోసం ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. one plus 10r ధర 35వేలు ఉండగా.. కంపెనీ 30వేల వోచర్ అందిస్తోంది. దీంతో కేవలం 5వేలు కట్టి కొత్త ఫోన్ తీసుకోవచ్చు.