Home > Business Trends > Tecno Pova 5 series: మార్కెట్‌లోకి 'టెక్నో' కొత్త ఫోన్లు..ధర రూ.15 వేల లోపే

Tecno Pova 5 series: మార్కెట్‌లోకి 'టెక్నో' కొత్త ఫోన్లు..ధర రూ.15 వేల లోపే

Tecno Pova 5 series: మార్కెట్‌లోకి టెక్నో కొత్త ఫోన్లు..ధర రూ.15 వేల లోపే
X

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ టెక్నో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. టెక్నో పోవా 5 సిరీస్ లో భాగంగా విడుదల చేసిన ఈ ఫోన్లలో ఒకటి టెక్నో పోవా 5 కాగా.. మరొకటి టెక్నో పోవా 5 ప్రో. ఈ రెండు డివైజ్ లు కూడా 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తాయి. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రెండింటిలోనూ 50 మెగాపిక్సెల్ రెయిర్‌ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. ఇవి ఆండ్రాయిడ్ 13 పై రన్ అవుతుంది. టెక్నో పోవా 5 ప్రో ఫోన్లో టెక్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా 3డీ టెక్స్చర్ డిజైన్, ఏఆర్సీ ఇంటర్ ఫేస్ తో వస్తోంది. మల్టీ కలర్డ్ ఎల్ఈడీ బ్యాక్ లైట్ తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

ఈ టెక్నో పోవా 5 ఫోన్ హర్రికేన్ బ్లూ, యాంబర్ గోల్డ్, మెకా బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. టెక్నో పోవా 5 ప్రో మాత్రం సిల్వర్ ఫ్యాంటసీ, డార్క్ ఇల్యూషన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ల ధరలను సంస్థ తాజాగా ప్రకటించింది. టెక్నో పోవా 5 ధర రూ. 11,999. పోవా 5 ప్రో ధర రూ. 14,999. ఫలితంగా ఈ రెండు మొబైల్స్​.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో ఉన్న పోటీని మరింత పెంచేశాయి.

ఈ స్మార్ట్​ఫోన్స్​ ఫీచర్స్​ ఇవే..

టెక్నో పోవా 5లో మీడియా టెక్​ హీలియో జీ99 చిప్​సెట్​ ఉండగా.. ప్రో మోడల్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్​ లభిస్తోంది.

టెక్నో పోవా 5.. ఆంబర్​ గోల్డ్​, హరికెన్​ బ్లూ, మెచా బ్లాక్​ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ప్రో మోడల్​లో డార్క్​ ఇల్యూషన్స్​, సిల్వర్​ ఫ్యాంటసీ కలర్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి.

టెక్నో పోవా 5లో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ (45వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​), పోవా 5 ప్రోలో 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీలు (68వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​) ఉన్నాయి. వీటిలో 4జీ వోల్ట్​ఈ, వై-ఫై, బ్లూటూత్​ 5.0, జీపీఎస్​, టైప్​-సీ పోర్ట్​, ఎన్​ఎఫ్​సీ, 3.5ఎంఎం ఆడియో జాక్​లు వస్తున్నాయి.

ఇక ఈ మోడల్స్​.. ఆగస్టు 22 నుంచి అమోజాన్​లో అందుబాటులోకి వస్తాయి. స్మార్ట్​ఫోన్​ ఎక్స్​ఛేంజ్​తో రూ. 1000 తగ్గింపు కూడా వస్తుండటం విశేషం.



Updated : 15 Aug 2023 8:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top