బంగారం ధర పతనం.. వెండి కూడా
కొన్నాళ్లు స్థిరమే..
X
పసిడి ప్రియులకు కాస్త ఊరట. బంగారం ధరలు మరింత తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 కేరట్ల మేలిమి బంగారం ధర పది గ్రాములకు రూ. 770 తగ్గి రూ. 60,330కి చేరుకుంది. 22 కేరట్ల బంగారం ధర రూ. 700 పడిపోయి రూ. 55,330 వద్ద నిలించింది. ఇటీవల కాలంలో ఇంత తగ్గుదల ఇదే తొలిసారి.
కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న వెండి ధర కూడా దిగొచ్చింది. కేజీ ధర రూ. 78,600 నుంచి రూ. 800 తగ్గి రూ. 77, 800కు చేరుకుంది. రజతం ధరలు రూ. 83 వేలకు కూడా చేరుకుని ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడం తెలిసిందే. మేలిమి బంగారం కూడా దాదాపు 63 వేలకు చేరుకుని తర్వాత పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగార ధర కొన్ని రోజులుగా క్రమంగా కుప్పకూలుతోంది. స్పాట్ గోల్డ్ ధర గత సెషన్ తో పోలిస్తే 10 డాలర్ల తగ్గి 1983 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ధరలు వేసవిలో కాస్త స్థిరంగా కొనసాగే అవకాశముందని నిపుణుల అంచనా. పెళ్లిళ్ల సీజన్ కాకపోవడం, పండగలు కూడా లేకపోవడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.