Home > కెరీర్ > ముగిసిన స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్.. మస్త్గా మిగిలిన ఇంజినీరింగ్ సీట్లు

ముగిసిన స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్.. మస్త్గా మిగిలిన ఇంజినీరింగ్ సీట్లు

ముగిసిన స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్.. మస్త్గా మిగిలిన ఇంజినీరింగ్ సీట్లు
X

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. ఈ సారి 16,296 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. సీఎస్‌ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు.. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌లో 4,959 సివిల్‌, మెకానికల్లో 5,156, ఇతర కోర్సుల్లో 458 సీట్లు మిగిలినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. స్పెషల్ ఫేజ్లో 1966 సీట్లను కేటాయించారు.

స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్లో 10,535 మంది విద్యార్థులు సీట్లు మార్చుకున్నట్లు అధికారులు చెప్పారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 178 కాలేజీల్లో మొత్తం 85,671 బీటెక్‌ సీట్లున్నాయి. ఇందులో 69,375 సీట్లు (80.97శాతం) భర్తీ అవ్వగా.. ఇంకా 16, 296 సీట్లు మిగిలిపోయినట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే బీటెక్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ముగియగా.. ఈ విద్యా సంవత్సరం సీట్లన్నీ ఇక ఖాళీగా ఉండనున్నాయి. అయితే అడపదడపా సీట్లను స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కాలేజీలే విద్యార్థులను చేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.



Updated : 24 Aug 2023 10:09 PM IST
Tags:    
Next Story
Share it
Top