Home > కెరీర్ > టెన్త్ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే గవర్నమెంట్ జాబ్

టెన్త్ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే గవర్నమెంట్ జాబ్

టెన్త్ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే గవర్నమెంట్ జాబ్
X

పోస్టల్ డిపార్ట్మెంట్లో కొలువుల జాతర కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 52వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన తపాలాశాఖ వాటి భర్తీ ప్రక్రియ కొనసాగిస్తోంది. తాజాగా మరో 30వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) పోస్టుల కోసం ఆగస్టు 3 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ నెల 23వరకు ఆన్‌లైన్‌లో https://indiapostgdsonline.gov.in/ అప్లై చేసుకోవచ్చని చెప్పింది.

పరీక్ష లేకుండానే

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ / డాక్‌సేవక్‌ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. టెన్త్లో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష కచ్చితంగా నేర్చుకొని ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జితో పాటు సైకిల్‌ తొక్కడం రావాలి.

జీతం ఎంతంటే..?

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పే స్కేల్ రూ.12 వేలు -రూ.29,380; ఏబీపీఎం/డాక్‌ సేవక్‌కు రూ.10వేలు -24,470గా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలంటే..?

30,041 పోస్టుల్లో ఏపీలో 1058, తెలంగాణలో 961 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు 4 గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. అలాగే, వీటితో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సర్వీసులకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో ప్రోత్సాహకాలు ఇస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ తదితర వస్తువులను పోస్టల్ డిపార్ట్ మెంట్ సమకూరుస్తుంది.

Updated : 3 Aug 2023 6:05 PM IST
Tags:    
Next Story
Share it
Top