Home > కెరీర్ > Central JOBS: పది పాసైన వారికి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

Central JOBS: పది పాసైన వారికి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

Central JOBS: పది పాసైన వారికి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
X

కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల్లో 362 సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్ పోర్ట్ (డ్రైవర్) పోస్ట్ లు ఉండగా.. 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్ట్ లకు జీతాలు.. రూ.18 వేల నుంచి రూ. 69,110 వరకు ఉన్నాయి. ఆసక్తికలిగిన వారు నవంబర్ 13, రాత్రి 11:59 లోగా అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో రాతపరీక్ష ఉండనుంది.

ఏజ్ లిమిట్: సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్ల చొప్పున వయో పరిమితి ఉంటుంది.

ఎగ్జామ్ ఫీ: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.450 పరీక్ష ఫీజు.

ఎంపిక ప్రక్రియ: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో రాత పరీక్ష. డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ల అనంతరం అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు: ఆంధ్రప్రధేశ్ లో.. అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం నగరాల్లో ఉన్నాయి.

తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, వరంగల్‌ అర్బన్‌ నగరాల్లో ఉన్నాయి.

ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.. https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/85755/Index.html

Updated : 15 Oct 2023 6:31 PM IST
Tags:    
Next Story
Share it
Top