Home > కెరీర్ > ఏపీ అటవీ శాఖలో 689 పోస్టులు..ఖాళీల వివరాలివే

ఏపీ అటవీ శాఖలో 689 పోస్టులు..ఖాళీల వివరాలివే

ఏపీ అటవీ శాఖలో 689 పోస్టులు..ఖాళీల వివరాలివే
X

ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను ఏపీపీఎస్సీ తీసుకుంది. విద్యా అర్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేయనుంది. హోంశాఖలో ఖాళీగా ఉండే 7 జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.

రక్షణ శాఖలో పదవీవిరమణ చేసిన అధికారులతో ఆ 7 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అందులో కూడా 60 శాతం జీతాన్ని, ఇతర భత్యాలను కేంద్ర రక్షణశాఖ ఇవ్వనుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ చెక్‌ చేసుకోవాలని తెలిపింది. ఇకపోతే అటవీశాఖలో మొత్తం 689 పోస్టులు ఉన్నాయి. అందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37 కాగా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుటు 70 ఉన్నాయి.

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అధికంగా 375 ఖాళీలు ఉన్నాయి. థానేదార్ పోస్టులు 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12 ఉండగా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 18 నుంచి 42 ఏళ్ల వయసు గలవారు అర్హులుగా ఉండాలి. ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.45 వేల వరకూ వేతనం ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/ లో చూసి తెలుసుకోవచ్చు.


Updated : 8 Feb 2024 3:00 PM IST
Tags:    
Next Story
Share it
Top