Home > కెరీర్ > ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 496 ఉద్యోగాలు.. జీతం 1.40 లక్షలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 496 ఉద్యోగాలు.. జీతం 1.40 లక్షలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 496 ఉద్యోగాలు.. జీతం 1.40 లక్షలు
X

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)లో భారీస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దేశంలోని పలు ఏఏఐ ప్రాంతీయ విభాగాల్లో ఖాళీగా ఉన్న 496 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నవంబర్ 1 నుంచి 30వ తేదీలోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జీతం నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.40 లక్షల దాకా ఉంటుంది.



అభ్యర్థులు బీఎస్సీ (ఫిజిక్స్‌/మ్యాథ్స్‌) లేదా బీఈ/ బీటెక్‌ చేసి ఉండాలి. వయసు 2023 నవంబర్ 30 నాటికి 27 ఏళ్లు లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. రాత పరీక్ష, స్వరపరీక్ష, మానసిక సామర్థ్యం, వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు https://www.aai.aero/en/careers/recruitment చూడండి.


Updated : 25 Oct 2023 8:55 AM IST
Tags:    
Next Story
Share it
Top