Home > కెరీర్ > కేంద్ర ప్రభుత్వ సంస్థలో 906 ఉద్యోగాలు.. డిగ్రీ చాలు, టెస్ట్ లేదు..

కేంద్ర ప్రభుత్వ సంస్థలో 906 ఉద్యోగాలు.. డిగ్రీ చాలు, టెస్ట్ లేదు..

కేంద్ర ప్రభుత్వ సంస్థలో 906 ఉద్యోగాలు.. డిగ్రీ చాలు, టెస్ట్ లేదు..
X

కేంద్ర ప్రభుత్వ ఆధ్వరంలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS)లో 906 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్ల కాంట్రాక్టు కింద సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష లేకుండా డిగ్రీ మార్కులు, ఇంటర్వ్యూ, కంటిపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంతోపాటు చెన్నై, వారణాసి తదితర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు జీతం తొలి ఏడాది నెలకు రూ.30 వేలు, రెండో ఏడాది రూ.32 వేలు, మూడో ఏడాది రూ.34 వేలు ఇస్తారు.

అర్హతలు

60 శాతం మార్కులలో ఏదో ఒక డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. డిసెంబర్ 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

పూర్తి వివరాలకు..


Updated : 23 Nov 2023 5:24 PM IST
Tags:    
Next Story
Share it
Top