Home > కెరీర్ > SI Recruitment : ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదల

SI Recruitment : ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదల

SI Recruitment : ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదల
X

ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను ఏపీ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని అందుబాటులో ఉంచింది. మెయిన్ పరీక్ష తుది ఆన్సర్ కీ కూడా విడుదలైంది. అభ్యర్థులు తమ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసేకోవచ్చు. మొత్తం 411 ఎస్సై పోస్టుల కోసం గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరిలో ప్రాథమిక రాతపరీక్ష జరిగింది. మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ప్రాథమిక రాత పరీక్షకు 1,51,288 మంది హాజరయ్యారు. వారిలో 57,923 మంది అర్హత సాధించానరు. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన 31,193 మంది అభ్యర్థులకు తర్వాత రాత పరీక్ష నిర్వహించారు.


Updated : 7 Dec 2023 11:01 AM IST
Tags:    
Next Story
Share it
Top